వెస్టిండీస్‌పై మూడు వన్డేల సిరీసును టీమ్‌ఇండియా క్లీన్‌స్వీప్‌ చేసింది.

వరుసగా రెండోసారీ ఆ జట్టుపై 3-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది.

ఆఖరి వన్డేకు వరుణుడు అంతరాయం కలిగించినా గబ్బర్‌ సేన అదరగొట్టింది.

డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 35 ఓవర్లకు 257 పరుగుల లక్ష్యంతో కరీబియన్లు బరిలోకి దిగారు.

భారత బౌలర్లు వారిని ఓ ఆటాడించారు. కేవలం 26 ఓవర్లకే 137కు కుప్పకూల్చారు.

బ్రాండన్‌ కింగ్‌ (42), నికోలస్‌ పూరన్‌ (42) టాప్‌ స్కోరర్లు. యూజీ 4, శార్దూల్‌, సిరాజ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

టీమ్‌ఇండియాలో శుభ్‌మన్‌ గిల్‌ (98 నాటౌట్‌; 98 బంతుల్లో 7x4, 2x6) శతకానికి చేరువయ్యాడు.

శిఖర్‌ ధావన్‌ (58; 74 బంతుల్లో 7x4, 0x6), శ్రేయస్‌ అయ్యర్‌ (44; 34 బంతుల్లో 4x4, 1x6) అదరగొట్టారు.

భారత్ మొదట 24 ఓవర్లు బ్యాటింగ్ చేశాక వర్షం పడింది. అప్పుడు మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు.

36 ఓవర్లు బ్యాటింగ్ చేశాక మళ్లీ వర్షం పడటంతో ఓవర్ల సంఖ్య 35కు తగ్గింది. టీమిండియా 36 ఓవర్లకు 225-3తో నిలిచింది.