టీమ్‌ఇండియా యువ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ అద్భుతం చేశాడు.

టెస్టు కెరీర్లో ఐదోసారి ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు.

ఇందుకోసం అతడు కేవలం నాలుగు టెస్టులే ఆడటం గమనార్హం

కాన్పూర్‌ టెస్టులో తన ఎడమచేతి వాటం స్పిన్‌తో కివీస్‌ను ఉక్కిరి బిక్కిరి చేశాడు.

94.3వ బంతికి రాస్‌ టేలర్‌ను ఔట్‌ చేశాడు. కీపర్‌ భరత్‌ క్యాచ్‌ అందుకున్నాడు. అప్పటికి స్కోరు 214/3

96.5వ బంతికి హెన్రీ నికోల్స్‌ను పెవిలియన్‌ పంపించాడు. వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అప్పటికి స్కోరు 218/4

102.1వ బంతికి శతకానికి చేరువైన టామ్ లేథమ్‌ను ఔట్‌ చేశాడు. అప్పటికి స్కోరు 227/5

123.4వ బంతికి టామ్‌ బ్లండెల్‌ను బౌల్డ్‌ చేశాడు. అప్పటికి స్కోరు 258/7

127.4వ బంతికి టిమ్‌ సౌథీని బౌల్డ్‌ చేయడంతో అక్షర్‌కు ఐదో వికెట్‌ దక్కింది. అప్పటికి స్కోరు 270/8

ఇంగ్లాండ్‌ సిరీసులోనూ అతడిలాగే చేశాడు. మోతెరాలో మూడు మ్యాచుల్లోనే నాలుగుసార్లు ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు.