ఇంట్లో ఇవి ఉంటే సంపద ఆవిరైపోతుంది

ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచే వస్తువులు ఉంటే డబ్బు రావడం తగ్గుతుంది.

ఇంటి లోపల డస్ట్ బిన్ ను పెట్టకూడదు. ఇంటి బయటే దాని స్థానం ఉండాలి. ఒకవేళ ఇంటిలోపల డస్ట్ బిన్ పెట్టాల్సి వస్తే దాన్ని రోజూ శుభ్రం చేసుకోవాలి.

దుస్తులను, వస్తువులను క్రమపద్ధతిలో సర్దుకోకుండా కుప్పలా పడేసినా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

పాత రసీదులు, బ్యాంక్ స్టేట్ మెంట్లు, అప్పుల తాలూక కాగితాలు... ఇలా చాలా పాత ఫైనాన్షియల్ పేపర్లు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి.

సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవహించాలంటే ఇల్లు దుమ్ము రహితంగా ఉండాలి. కిటికీలను పట్టిన దుమ్మును ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి.

ఎండిపోయిన మొక్కలు, చనిపోయిన మొక్కల్ని ఇంట్లో ఉంచుకోకూడదు. మొక్కలను జాగ్రత్తగా పెంచుకోవాలి. వాటిని ఎంత బాగా పెంచితే అంతగా పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవహిస్తుంది.

ఇళ్లల్లో కొళాయిలు చుక్కచుక్క కారుతూ ఉన్నా కూడా నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. షెంగ్ షుయ్ ప్రకారం లీకవుతున్న కొళాయిలను పట్టించుకోకపోతే, మీరు మీ ఇంటిపట్ల అశ్రద్ద వహించినట్టు.

చాలా మంది చనిపోయిన తమ స్నేహితుల, బంధువుల ఫోటోలు, దుస్తులు, డైరీల్లాంటివి దాచుకుంటూ ఉంటారు. ఇంట్లో వేటిని చూస్తే మీ మనసు బాధతో నిండిపోతుందో అలాంటి వాటిని ఉంచుకోకూడదు.

మీ మనసు ఎంత తేలికగా, సంతోహంగా ఉంటుందో... మీ ఇంట్లో అంతగా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. డబ్బు నిలకడగా ఉంటుంది.