కార్తీకదీపం: జ్యోతి స్వరూపంలో భగవంతుడిని చేరే ఆత్మ



ఆకాశం, నీరు, అగ్ని, గాలి, భూమి.. పంచభూతాలు, సకల ప్రాణికోటికీ జీవనాధారాలు.



శివ పంచాక్షరీ మంత్రం అయిన న-మ-శి-వా-య అనే పంచ బీజాక్షరాల నుంచి పంచ భూతాలు, వాటి నుంచి సమస్త జగత్తు పుట్టిందని శాస్త్రవచనం.



ఆత్మను జ్యోతి స్వరూపంగా భావిస్తారు. మరణానంతరం మనలో ఉండే ఆత్మ జ్యోతి స్వరూపంగా మారి భగవంతుడిని చేరుతుందని చెబుతారు.



పంచభూతాల్లో ఒకటైన అగ్ని అనే జ్యోతి స్వరూపాన్ని..పంచభూతాల్లో మరొకటైన నీటిలో వదలుతున్నారు.



ఆత్మని పంచభూతాత్మకం అయిన పరమేశ్వరుడి అంకితం చేయడమే దీని వెనుకున్న ఆంతర్యం



కార్తీకమాసంలో దీపాలు నదుల్లో వదిలితే పూర్వజన్మలో చేసిన పాపాలతో పాటూ ఈ జన్మలో చేసిన పాపాలు నశించి పరమేశ్వరుడి సన్నిధికి చేరుతామంటారు.



బ్రహ్మ ముహూర్తంలో స్నానమాచరించి త్రికరణ శుద్ధిగా కార్తీక దీపాలు నీటిలో విడిచిపెడతారు.



అన్ని మాసాల్లో చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలకన్నా.. కార్తీక మాసంలో చేసే ఉపవాసం,స్నానం, దానం ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయంటారు పండితులు.



Images Credit: Pinterest