వానాకాలం ముగిసి చలికాలం ప్రారంభమయ్యే సమయంలో రకరకాల ఇన్ఫెక్షన్లు దాడి చేస్తాయి.
మనుషుల శరీరంలో మాత్రమే కాదు జంతువుల శరీరంలోనూ ఈ మార్పులుంటాయి. ఆ జంతువులను చంపి తినడం వల్ల అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టే
వాతావరణం మందంగా ఉండడం వల్ల తేలికపాటి ఆహారం జీర్ణం అవుతుంది...నాన్ వెజ్ తింటే సరిగా జీర్ణం కాక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.
నాన్ వెజ్ వంటకాల్లో ఎక్కువగా వినియోగించే ఉల్లి, వెల్లుల్లి కోర్కెలు పెంచుతాయి.
మనం తినే ఆహారమే మన గుణాన్ని ( సత్వగుణం, తమోగుమం, రజోగుణం) నిర్ణయిస్తుంది. అందుకే ఆహారాన్ని కూడా ఈ మూడు రకాలుగా చెబుతారు.
సాత్విక ఆహారాన్ని తీసుకునేవారు ప్రేమ, కృతజ్ఞత, అవగాహనతో ఉంటారు. వారిలో ప్రశాంతత కనిపిస్తుంది. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు.
రజోగుణం కలిగించే ఆహారాలను తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది కానీ శరీర సమతుల్యత గాడి తప్పుతుంది, జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది.
తమో గుణాన్ని కలిగించే ఆహారం భుజించేవారు బద్దకంగా, నిస్తేజంగా, జీవితం పట్ల నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా వ్యవహరిస్తారు.
ప్రశాంతతకు, ఏకాగ్రతకు భంగం కలిగించే మాంసాహారం, ఉల్లి , వెల్లుల్లి వంటి మసాలాదినుసులకు దూరంగా ఉండం..ఆధ్యాత్మికపరంగా, ఆరోగ్యపరంగా కూడా మంచిది Image Credit: Pinterest