మీ ఆధార్ కార్డ్‌మీద మీకు తెలియకుండా ఎవరైనా సిమ్ వాడుతున్నారా? ఈ విషయం తెలుసుకోవాలంటే మీరు ఈ కింది స్టెప్లు ఫాలో అయిపోండి. ముందుగా గూగుల్ సెర్చ్‌లో TAFCOP అని సెర్చ్ చేయండి. tafcop.sancharsaathi.gov.in అనే సైట్‌పై క్లిక్ చేసి ఓపెన్ చేయండి. దానిలో మీరు మీ మొబైల్ నెంబర్, అక్కడ వచ్చిన కోడ్ ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపిని ఎంటర్ చేస్తే మీ ఆధార కార్డ్ మీద రిజిస్టర్ అయి ఉన్న నెంబర్ల లిస్ట్ కనిపిస్తుంది. అందులో మీరు ఉపయోగించని నెంబర్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోండి. మీరు వాడని నెంబర్ ఉంటే NOT MY NUMBER ఆప్షన్ని క్లిక్ చేసి రిపోర్ట్ చేయాలి. (Images Source : Pinterest)