టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. మొదట భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. వర్షం వల్ల బంగ్లా లక్ష్యాన్ని 16 ఓవర్లలో 151కి కుదించారు. ఛేదనలో బంగ్లా 6 వికెట్ల నష్టానికి 145 మాత్రమే చేసింది. దీంతో టీమిండియా ఐదు పరుగులతో విజయం సాధించింది. ఈ విజయంతో తిరిగి భారత్ టేబుల్ టాపర్‌గా నిలిచింది. అర్థ సెంచరీ చేసి విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. బంగ్లాలో లిటన్ దాస్ (60: 27 బంతుల్లో) టీమ్ఇండియాను భయపెట్టాడు. వర్షానికి ముందు వరకు బంగ్లాదేశ్ డ/లూ ప్రకారం 17 పరుగుల ముందంజలో ఉంది. వర్షం తర్వాత టీమ్ఇండియా డామినేట్ చేసింది.