రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ'లో దివ్యాంశ కౌశిక్ ఒక కథానాయిక. జూలై 29న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె చెప్పిన విశేషాలు... 'రామారావు ఆన్ డ్యూటీ'లో హీరో భార్యగా, చిన్నారికి తల్లిగా నందిని పాత్రలో కనిపిస్తా. కరోనా తగ్గిన తర్వాత ఇన్‌స్టాలో ట్రెడిషనల్ ఫోటోలు పోస్ట్ చేశా. అవి నచ్చి నందిని పాత్రకు దర్శకుడు శరత్ మండవ నన్ను ఎంపిక చేశారు. శరత్ గారు కథ చెప్పినప్పుడు క్యారెక్టర్ బాగా నచ్చింది. చెప్పిన దాని కంటే ఆయన బాగా చేశారు. మొదట నేను రవితేజ గారికి పెద్ద ఫ్యాన్. ఎప్పట్నుంచో ఆయనతో పని చేయాలని అనుకుంటున్నా. 'రామారావు ఆన్ డ్యూటీ'తో రవితేజతో నటించడం గౌరవంగా భావిస్తున్నా. రవితేజను కలవడం నాకొక ఫ్యాన్ మూమెంట్. ఆయన సెట్స్‌లో ఉంటే అందరికీ ఆ ఎనర్జీ వస్తుంది. స్పెయిన్‌లో 'రామారావు ఆన్ డ్యూటీ' షూట్ చేసినప్పుడు జర్మనీ, పాకిస్తాన్ నుంచి వచ్చిన వారు రవితేజ గారితో ఫోటోలు తీసుకున్నారు. సినిమా 90ల నేపథ్యంలో తెరకెక్కింది. ప్రేక్షకులు కోరుకునే అంశాలు అన్నీ ఉంటాయి. 'రామారావు ఆన్ డ్యూటీ' అందరికీ థ్రిల్ ఇస్తుంది. మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ .. అందరి హీరోలతో పని చేయాలని ఉంది. 'మజిలీ'లో బబ్లీగా కనిపించా. తర్వాత సన్నబడాలని స్పెషల్ డ్యాన్స్ క్లాసులు తీసుకున్నా. డైట్ ప్లాన్ ఏదీ లేదు. ప్రస్తుతం సుదీర్ వర్మతో ఒక సినిమా, అలాగే 'మైఖేల్' అని మరో సినిమా చేస్తున్నా. 'రామారావు ఆన్ డ్యూటీ' కంటే ముందు నాగ చైతన్య 'మజిలీ'లో దివ్యాంశ కౌశిక్ నటించారు. ఇవండీ దివ్యాంశ కౌశిక్ చెప్పిన సంగతులు