ధనియాలు - అరకప్పు జీలకర్ర - రెండు టీస్పూనులు షాజీరా - రెండు టీస్పూనులు యాలకులు - ఇరవై దాల్చిన చెక్క ముక్కలు - నాలుగు మరాఠీ మొగ్గలు - నాలుగు
జాజికాయ - ఒకటి లవంగాలు - ముప్పై జాపత్రి - నాలుగు మిరియాలు - రెండు టీస్పూనులు అనాస పువ్వులు - ఆరు బిర్యానీ ఆకులు - నాలుగు సోంపు గింజలు - రెండు టీస్పూనులు
స్టవ్ పై కళాయి పెట్టి జాజికాయ, అనాసపువ్వు, జాపత్రి, ధనియాలు, మరాఠీ మొగ్గలు వేసి వేయించాలి.
అయిదు నిమిషాల వేగాక బిర్యానీ ఆకులు వేయాలి.
వేయించిన అన్నింటినీ మిక్సీలో వేసి మెత్తటి పొడిలా చేసుకోవాలి.
ఈ పొడిని సీసాలో వేసి గాలి చొరబడకుండా మూత పెట్టి దాచుకోవాలి.
మూత తీసి ఎక్కువ సేపు ఉంచకూడదు. వాసన బయటికి పోతే ఆ పొడి వేసినా వ్యర్థమే.