ఈ నెల 30 నుంచి గోల్కొండ ఆషాఢం బోనాలు..తొలి బోనం జగదాంబిక ఎల్లమ్మ అమ్మవారికే



చారిత్రక నగర వైభవాన్ని చాటే ఆషాఢ బోనాలు ప్రజల ఐకమత్యాన్ని చాటుతాయి. తొలి బోనం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించడంతో ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది.



అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్



గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ట్రస్టు తరపున సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి, లాల్‌దర్వాజ, కార్వాన్‌ దర్బార్‌ మైసమ్మ, లంగర్‌హౌస్‌ బుజిలి మహంకాళి ఆలయం, షేక్‌పేట్‌ మహంకాళి ఆలయం, సబ్జిమండి నల్లపోచమ్మ ఆలయాలకు పట్టువస్త్రాలు



గోల్కొండ బోనాల ప్రారంభం రోజు తొట్టెల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తొట్టెలను తెచ్చి కోటపై ఉన్న జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో సమర్పిస్తారు.



పోతురాజుల విన్యాసాలు బోనాల జాతరలో హైలెట్‌గా నిలుస్తాయి. తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేశారు.



లంగర్‌హౌస్‌ చౌరస్తాలో మంత్రులు పట్టువస్త్రాలు సమర్పించిన తర్వాత గోల్కొండలో పూజారి ఇంటి నుంచి ఉత్సవ విగ్రహాలను తొట్టెలతోపాటు కోటపై వరకు ఊరేగించి ఆలయంలో ప్రతిష్టిస్తారు.



కరోనాతో రెండేళ్లు బోసిపోయిన ఉత్సవాలు ఈ ఏడాదికి కన్నులపండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు



జూన్ 30న మధ్యాహ్నం 12గంటలకు గోల్కొండ బోనాలు,జులై 17న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు, జులై 18న రంగం, భవిష్యవాణి



జులై 24న భాగ్యనగర బోనాలు, జులై 25న ఉమ్మడి దేవాలయాల ఘటాల ఊరేగింపు ఉంటుంది.



జులై 28 తో బోనాల ఉత్సవాలు ముగియనున్నాయి.
(Images Credit: Pinterest)