ఎక్కువగా బర్త్‌డేలు, పెళ్లిరోజులను చాలామంది మర్చిపోతుంటారు! కొద్దిమందికి తమ ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి సంభాషణలు షెడ్యూలు చేయాల్సి ఉంటుంది.



అలాంటి వారికి వాట్సాప్‌లో షెడ్యూలింగ్‌ ఫీచర్‌ ఉంటే ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ వాట్సాప్‌లో లేనప్పటికి మరో దారిలో సందేశాలను షెడ్యూలు చేయొచ్చు.



వాట్సాప్‌లో సందేశాలను షెడ్యూలు చేసేందుకు ఒక థర్డ్‌ పార్టీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ వినియోగదారులు SKEDit యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది.



వాట్సాప్‌ బిజినెస్‌ ఖాతాలోనే ప్రస్తుతం 'యూజింగ్‌ అవే మెసేజెస్‌' ఫీచర్‌ ఉంది. దీని ద్వారా కావాల్సిన సమయంలో సందేశాలను షెడ్యూలు చేసుకోవచ్చు.



మొదట వాట్సాప్‌ ఓపెన్‌ చేసి 'మోర్‌' ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. బిజినెస్‌ టూల్స్‌లో అవే మెసేజెస్‌ను ఎంచుకోవాలి.



సెండ్‌ అవే మెసేజ్‌ను ఆన్‌ చేసుకోవాలి. ఆపై సందేశంపై నొక్కి కస్టమైజ్‌ చేసుకోవచ్చు.



ఆ తర్వాత ఓకేపై క్లిక్‌ చేసి షెడ్యూలు చేసుకోవాలి. ఆల్వేస్‌, కస్టమ్‌ షెడ్యూలు, వ్యాపార వేళలు ముగిసిన తర్వాత షెడ్యూలు చేసుకోవచ్చు.



అందరికీ, అడ్రస్‌ బుక్‌లోని లేని అందరికీ, కొందరిని మినహాయించి, కేవలం కొందరికి.. ఇలా ఎంచుకోవచ్చు.



ఆ తర్వాత సేవ్‌ చేస్తే మీరనుకున్న సమయానికి వాటిని పంపించొచ్చు.



ఐఓఎస్‌ యూజర్లకు థర్డ్‌పార్టీ యాప్‌ అవసరం లేదు. అయితే సిరి షార్ట్‌కట్స్‌ యాప్‌ను ఉపయోగించుకుంటే చాలు! దానిని డౌన్‌లోడ్‌ చేసుకొని ఓపెన్‌ చేసుకోవాలి. ఆటోమేషన్ ట్యాబ్‌కు వెళ్లాలి.



ప్లస్‌ సింబల్‌ను ఉపయోగించుకొని పర్సనల్‌ ఆటోమేషన్‌పై ట్యాప్‌ చేయాలి. ఆటోమేషన్‌ ఎప్పుడు రన్‌ చేయాలో ఆ సమయాన్ని ఎంచుకోవాలి.



యాడ్‌ యాక్షన్‌పై ట్యాప్‌ చేసి సెర్చ్‌బార్‌లో టైప్‌ చేయాలి.



ఆ తర్వాత టెక్స్ట్‌ ఏరియాలో ప్లస్‌ ఐకాన్‌పై ట్యాప్‌ చేసి మీ సందేశం షెడ్యూలు చేయాలి.



రిసిపెంట్‌ను ఎంచుకొని నెక్స్ట్‌పై క్లిక్‌ చేస్తే చాలు. షెడ్యూలు అయిపోయినట్టే.