గుడ్డుతో చేసిన వంటలు పిల్లలకు బాగా నచ్చుతాయి.ఆరోగ్యానికి కూడా మంచిది.
ఆలూ పరాటా బదులు ఈసారి గుడ్డుతో పరాటా చేసి చూడండి. రుచికి రుచికి, బలానికి బలం.
గోధుమపిండి - ఒక కప్పు గుడ్లు - రెండు పచ్చిమిర్చి - ఒకటి కారం - ఒక స్పూను కొత్తిమీర - ఒక కట్ట నూనె - రెండు స్పూనులు ఉల్లిపాయ - ఒకటి టొమాటో తరుగు- ఒకటిన్నర స్పూను పసుపు - చిటికెడు ఉప్పు - రుచికి సరిపడా నెయ్యి - అర స్పూను నీళ్లు - సరిపడినన్ని
చపాతీ పిండిని కలుపుకోవాలి.అలా కలిపాక ఓ 20 నిముషాలు పక్కన పెట్టాలి. గాలి తగలకుండా మూత పెట్టాలి.
ఒక గిన్నె తీసుకుని అందులో రెండు గుడ్లు కొట్టి వేయాలి. పచ్చి మిర్చి తరుగు, ఉల్లి పాయ తరుగు, టొమాటో తరుగు, కొత్తిమీర తరుగు, కారం, పసుపు, ఉప్పు అన్ని వేసి బాగా గిలక్కొట్టాలి.
ఇప్పుడు పిండి ముద్దని తీసి పొరలు పొరలుగా వచ్చేలా ఒత్తుకోవాలి. అలా ఒత్తుకున్న పరాటాని పెనంపై వేసి కాల్చాలి.
రెండు వైపులా సగం కాలాక, పరాటా పై పొరని చిన్న చాకుతో కోయాలి. పరాటా సంచిలా ఓపెన్ అవుతుంది. అందులో గిలక్కొట్టిన ఎగ్ మిశ్రమాన్ని వేయాలి.
మళ్లీ చపాతీని పెనంపై కాసేపు ఉంచాలి. లోపలి గుడ్డు మిశ్రమం ఆమ్లెట్లా మారుతుంది.
పరాటాని పై నుంచి గట్టిగా నొక్కితే ఆమ్లెట్ దానికి అతుక్కుంటుంది. బాగా కాల్చాక తీసి ప్లేటులో వేసుకోవాలి.