మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తోందని చెప్పే సంకేతాలివే



లక్ష్మీదేవి ఇంట్లో తిష్టవేసుకుని కూర్చోవాలని అందరూ కోరుకుంటారు, పూజిస్తారు, ప్రార్థిస్తారు.



ఎన్ని పూజలు చేసినా, ఎంత కష్టపడినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అమ్మవారి కరుణ లేదని బాధపడుతుంటారు.



లక్ష్మీదేవి వచ్చేముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయంటారు జ్యోతిష్య శాస్త్రం పండితులు



అకస్మాత్తుగా నల్ల చీమలు గుంపులుగా గుమిగూడి ఏవైనా తింటే మిమ్మల్ని లక్ష్మీదేవి అనుగ్రహించబోతోందని అర్థం



మీ ఇంటి గోడపై మూడు బల్లుల సమూహం కలిసి కనిపించినా శుభ సంకేతమేనట



ఇంటి పేదరికాన్ని తొలగించేందుకు అమ్మవారు మీ ఇంట అడుగుపెట్టబోతున్నారని సూచనట



చేతులు దురదా అని తిడతారు కానీ అకాస్మాత్తుగా కుడిచేతిలో దురద మొదలైతే ఆకస్మిక ధనలాభానికి సంకేతమట



మీ ఇంట్లో ఏమూలనైనా పక్షులు గూడు గడితే అదికూడా లక్ష్మీదేవి రాకకు శుభసూచకం



ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు దారిలో ఊడుస్తున్న వ్యక్తి కనిపిస్తే మీ దరిద్ర ఊడ్చుకుపోయి అమ్మవారి కటాక్షం లభిస్తుంది



కొన్ని పుస్తకాలు, పండితుల సూచనల ఆధారంగా రాసినవి....వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలో పూర్తిగా మీ వ్యక్తిగతం
(Images Credit: Pinterest)