మనీ ప్లాంట్ సరిగ్గా పెరగట్లేదా? ఈ టిప్స్ పాటించండి మనీ ప్లాంట్‌ను జాగ్రత్తగా చూసుకుంటే ఆరోగ్యంగా పెరుగుతుంది . ఈ కొన్ని టిప్స్ ఫాలో అయితే మనీ ప్లాంట్ చక్కగా పెరుగుతుంది. మనీ ప్లాంట్లు తేమతో కూడిన మట్టిలో బాగా పెరుగుతాయి . అలా అని ఎక్కువ నీళ్ళు కూడా పోయకూదదు , పై-పైనే కొద్ది కొద్దిగా పోయాలి. 3 రోజులకు ఒకసారి చెక్ చేస్తూ తగినన్ని నీళ్ళు పోస్తూ ఉండండి. మట్టిలో పెంచడం కుదరకపోతే నీళ్ళలో కూడా ఈ మొక్కను పెంచవచ్చు . వారానికి ఒకసారి కుండీలోని నీళ్ళు మార్చాలి . మనీ ప్లాంట్ ని నేరుగా ఎండలో పెట్టకండి , అలా అని నీడలో కూడా ఉంచకూడదు . ఎండా, నీడా రెండూ తగిలేలా కిటికీ దగ్గర పెడితే మొక్క బాగా పెరుగుతుంది.