గుడ్లు ఎక్కువ తింటే గుండెకు ముప్పు తప్పదా?

గుడ్లు తీసుకుంటే శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్ అందుతాయి.

మెదడు చురుగ్గా పనిచేయడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది.

పిల్లలు ఎదగడంలో ఎంతగానో తోడ్పాటు అందిస్తుంది.

గర్భిణీలు రోజూ ఓ గుడ్డు తీసుకుంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది.

గుడ్డులోని కాల్షియం జుట్టు, చర్మం, గోర్లు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది.

రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేయడంతో పాటు రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది.

రోజుకు ఒక గుడ్డు తీసుకుంటే శరీరానికి కావాల్సిన B, E, D విటమిన్లు లభ్యమవుతాయి.

గుడ్లను తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని అధికంగా తినకూడదట.

ఎక్కువ గుడ్లు తినడం వల్ల గుండె సమస్యలు రావచ్చని నిపుణులు చెప్తున్నారు.

అందుకే, రోజుకు ఒకటి లేదంటే రెండు గుడ్లు తినడం మంచిదంటున్నారు. All Photos Credit: Pixabay.com