ఈ సమస్యలు ఉంటే కాలీఫ్లవర్ అస్సలు తినకండి!

కాలీఫ్లవర్‌లోని పోషకాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

విటమిన్ C, ఫోలేట్, విటమిన్ B6, పొటాషియం, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి.

కొన్ని సమస్యలతో బాధపడుతున్న వాళ్లు కాలీఫ్లవర్‌కు దూరంగా ఉండటం మంచిదంటున్నారు నిపుణులు.

థైరాయిడ్‌ సమస్యలతో బాధపడే వాళ్లు కాలీఫ్లవర్‌ తింటే మరింత ఇబ్బంది ఏర్పడుతుంది.

గ్యాస్ సమస్య ఉన్న వాళ్లు కాలీఫ్లవర్ తింటే ఎసిడిటీ ఇబ్బంది పెరుగుతుంది.

కాలీఫ్లవర్‌ను అతిగా తినడం వల్ల కడుపు ఉబ్బరంతో పాటు జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

పాలిచ్చే తల్లులు కాలీఫ్లవర్‌ తింటే పిల్లలకు కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది.

కొందరికి కాలీఫ్లవర్‌ తినడం వల్ల చర్మంపై దురద, దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.

All Photos Credit: Pixabay.com