జీడిపప్పు మంచిదా? నకిలీదా? ఇలా గుర్తించండి!

మార్కెట్లో లభించే జీడిపప్పులు అన్నీ నిజమైనవి కాదు.

కొనేటప్పుడు కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే అసలు, నకిలీ జీడిపప్పును గుర్తించవచ్చు.

అసలు జీడిపప్పు తెలుపు, క్రీమ్ కలర్‌లో ఉంటుంది. నకిలీది లేత పసుపు, మరింత తెల్లగా ఉంటుంది.

నిజమైన జీడిపప్పు తేలికగా, చక్కటి రుచిని కలిగి ఉంటుంది. నమిలినప్పుడు దంతాలకు అంటుకోదు.

నకిలీ జీడిపప్పు గట్టిగా, జిగటగా ఉండటంతో పాటు దంతాలకు అతుక్కుంటుంది.

నిజమైన జీడిపప్పు అంగుళం పొడవు, కొద్దిగా మందంగా ఉంటుంది. నకిలీవి చిన్నగా లేదంటే పెద్దగా కనిపిస్తాయి.

నిజమైన జీడిపప్పు నీళ్లలో నానబెడితే మునుగుతుంది. నకిలీ జీడిపప్పు తేలుతుంది. All Photos Credit: pixabay.com