మేష రాశి ఈ రోజు ఈ రాశివారికి మంచి రోజు. మీ ప్రియమైన వారిని కలుస్తారు. రోజంతా సంతోషంగా ఉంటారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఈ రోజు ప్రత్యర్థులతో వాదోపవాదాలు జరగవచ్చు..మాట తూలకండి. ఉద్యోగులు అధికారులతో అనవసర చర్చలు పెట్టవద్దు.
వృషభ రాశి ఈ రోజు ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది. ఆస్తి వ్యవహారాలకు దూరంగా ఉండాలి. ప్రతికూల ఆలోచనలకు దరి చేరనివ్వకండి. మధ్యాహ్నం తర్వాత మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది.
మిథున రాశి ఈ రోజు మీరు ఊహించని ప్రయోజనం పొందుతారు. స్నేహితులు, బంధువులను కలుస్తారు. మధ్యాహ్నం తర్వాత, ప్రతికూల ఆలోచనలు మనసులో ఏదో ఆందోళన కలిగిస్తాయి. ఇంటి వాతావరణం గంభీరంగా ఉంటుంది.
కర్కాటక రాశి ఈరోజు ఈ రాశివారు తలపెట్టే పనులకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆకట్టుకునే మాటతీరుతో మీరు మీ పనులు సులభంగా పూర్తిచేయగలుగుతారు. స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది.
సింహ రాశి ఈ రోజు మీరు ఇంటి పెద్దల నుంచి ప్రయోజనం పొందుతారు. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. మీ మాటతీరులో కోపాన్ని తగ్గించుకోవాలి. కుటుంబ వాతావరణంలో సామరస్యం ఉంటుంది. ఈరోజు ఖర్చులు మించకుండా చూసుకోండి.
కన్యా రాశి ఈ రోజు ఏదైనా విషయంలో గందరగోళం ఉంటే దాన్ని తొలగించుకునేందుకు ప్రయత్నించండి. ఎవరితోనూ గొడవ పడకండి. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండకూడదని గుర్తుంచుకోండి. ఆదాయం కంటే ఖర్చులు పెరగవచ్చు. ఆందోళన భారం తగ్గుతుంది.
తులా రాశి ఈ రోజు చాలా ఆలోచనాత్మకంగా మాట్లాడండి. మీ మనోబలం తగ్గుతుంది. స్నేహితుల నుంచి విశేష ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. అనవసర భావోద్వేగానికి గురవుతారు. మనసు ఏదో ఆందోళన చెందుతుంది...ఆ ప్రభావం ఆరోగ్యంపై పడుతుంది.
వృశ్చిక రాశి ఈ రోజు మీరు ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న పని చాలా సులభంగా పూర్తవుతుంది. శాశ్వత ఆస్తి విషయాలకు సమయం మంచిది. ప్రభుత్వ పనులు లాభదాయకంగా ఉంటాయి. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది.
ధనుస్సు రాశి ఈ రోజు ఆరోగ్యం కూడా కొంత బలహీనంగా ఉంటుంది. మతపరమైన ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది. వ్యాపారంలో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. పనిలో కొంత మెరుగుదల ఉంటుంది. కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది.
మకర రాశి ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు రాకుండా జాగ్రత్త వహించండి. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అర్ధంలేని చర్చకు దూరంగా ఉండండి. సంప్రదాయ పనిని పూర్తి చేస్తారు. బంధువులను కలుస్తారు.
కుంభ రాశి ఈ రోజు వ్యాపార భాగస్వాములతో ఒత్తిడికి లోనవుతారు. వైవాహిక జీవితంలో గందరగోళం ఉంటుంది. విద్యార్దుల చదువులో మంచి పనితీరు ఉంటుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. రోజువారీ పనుల్లో కొన్ని అడ్డంకులు ఏర్పడవచ్చు.
మీన రాశి ఈ రోజు రోజువారీ పనుల్లో జాప్యం ఉంటుంది. ఆఫీసులో సహోద్యోగుల నుంచి మద్దతు తక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడవచ్చు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. కొత్త సంపాదన సాధనాలు పొందుతారు.