మేషం: గృహావసరాల కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు. సన్నిహితుల సలహాలను పాటించండి.ఎవరినీ దుర్భాషలాడవద్దు.దూకుడుగా వ్యవహరించవద్దు. వివాహ సంబంధ విషయాలు పరిష్కారమవుతాయి.
వృషభం: తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఎక్కువ నీళ్లు తాగండి. వైవాహిక సంబంధాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి.ఒకేసారి రెండు మూడు పనుల్లో వేలు పెట్టకండి.
మిథునం : వ్యాపారంలో లాభాలొస్తాయి.తలపెట్టిన ప్రతి పనిలోనూ మీ జీవిత భాగస్వామి మద్దతు పొందుతారు.కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఉన్నతాధికారుల నుంచి సహాయం పొందుతారు.
కర్కాటకం: మిత్రులను కలుసుకుంటారు. మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడతారు.గొంతు నొప్పితో బాధపడతారు. ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి రావొచ్చు.
సింహం: శ్రమాధిక్యత వల్ల అలసట చెందుతారు.సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.ప్రేమ వ్యవహారాలు అంత అనుకూలంగా ఉండవు. వివాహ ప్రతిపాదనలతో తొందరపడకండి.
కన్య: చర్మ సమస్యలు రావొచ్చు. పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించండి. మీ జీవిత భాగస్వామితో ఆలోచనలను పంచుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. టెక్నాలజీని ఉపయోగించడం నేర్చుకోండి.
తుల: స్నేహితులను కలుస్తారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. అనుభవజ్ఞులైన వ్యక్తులతో చర్చిస్తారు. మీ ప్రతిభను అంతా మెచ్చుకుంటారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశసంలు అందుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.
వృశ్చికం: మీరు ఉద్యోగంలో మార్పును అంగీకరించాల్సి ఉంటుంది. వ్యాపారంలో పెద్ద ఒప్పందాలు చేసుకోవచ్చు. కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేయండి.
ధనుస్సు: కుటుంబ సభ్యులతో అనవసర వివాదం ఉండొచ్చు. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతారు. ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తారు. పూర్వీకుల విషయాల్లో మీరు పైచేయి సాధిస్తారు. ప్రియమైన వ్యక్తి ప్రవర్తన వల్ల మీరు బాధపడతారు. అనవసర కార్యకలాపాలకు దూరంగా ఉండండి.
మకరం: మీరు కొత్త పనిని ప్రారంభించవచ్చు.ఎవరితోనైనా వివాదాలు వచ్చే అవకాశం ఉంది. బంధువుల కోసం ఖర్చు చేయాల్సిన అవసరం రావొచ్చు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చండి. అసిడిటీ సమస్యతో ఇబ్బంది పడతారు.
కుంభం: మీరు మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులు తక్కువ శ్రమతో విజయం సాధిస్తారు. ఆఫీసులో సహోద్యోగుల సహాయం అందుతుంది. ప్రయాణానికి అనుకూల సమయం. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. డ్రైవింగ్ చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉండకండి.
మీనం: వ్యాపారంలో లాభాలను పొందవచ్చు. ప్రేమికులు సంతోషంగా ఉంటారు. తలపెట్టిన పని పూర్తిచేయడం వల్ల ఒత్తిడి దూరమవుతుంది. ఎప్పటినుంచో చేతికందాల్సిన మొత్తం అందుతుంది.