Horoscope Today 20th July 2022
జులై 20 బుధవారం రాశిఫలాలు



మేషం
మీకు అదృష్టం కలసొస్తుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. చాలా కాలంగా కార్యాలయంలో నిలిచిపోయిన ఏదైనా ముఖ్యమైన పని కచ్చితంగా పూర్తవుతుంది. వ్యాపారులు సక్సెస్ అవుతారు. ఆస్తికి సంబంధించిన వివాదాలు మీకు అనుకూలంగా ఉంటాయి



వృషభం
ఈరోజు మీరు మానసికంగా బాధపడతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు ఎవ్వరితోనూ అనవసరంగా వాదనలు పెట్టుకోవద్దు.కొత్త వ్యాపారం, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు కాదు.



మిథునం
ఏదో గందరగోళంలో ఉంటారుకానీ ఆ పరిస్థితి నుంచి తొందరగానే బయటపడతారు. సహనం-శ్రమను బ్యాలెన్స్ చేసుకోవడం చాలా అవసరం. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఓ వ్యక్తితో మీకున్న వివాదం పరిష్కారం అవుతుంది. ఓ శుభవార్త వింటారు



కర్కాటకం
మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు ఇదే మంచి సమయం. అనవసర ఆలోచనతో కాలం గడపకుండా మీ పనిపై ఎక్కువ దృష్టిసారించండి. మీ తెలివితేటలు,నైపుణ్యంతో ప్రత్యర్థులను అధిగమిస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.



సింహం
ఈ రోజు మీరు అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. మితిమీరిన సిన్సియారిటీ కూడా పనికిరాదు. పిల్లల వైపు నుంచి శుభవార్త వింటారు. మాటలను నియంత్రించుకోవాలి. ఎక్కువ ఒత్తిడికి గురికావొద్దు. అనవసర వివాదాలు తెరపైకి రాకుండా జాగ్రత్త పడండి.



కన్య
కెరీర్ మార్చుకోవాలి అనుకుంటే ఇదే సరైన సమయం అని చెప్పొచ్చు. మీరు తలపెట్టే పనులకు స్నేహితులు, బంధువుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. అందర్నీ గౌరవించండి. వృత్తి ఉద్యోగాల్లో ఉండేవారికి మంచి సమయం.



తుల
ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి లేదా సహోద్యోగుల నుంచి పూర్తి స్థాయి మద్దతు పొందలేరు. ఈ పరిస్థితి మిమ్మల్ని మానసికంగా గందరగోళంలోకి నెట్టేస్తుంది. అలాంటప్పుడు మీ బలహీనతను బయటకు చెప్పొద్దు. ఉద్యోగం మారే ఆలోచన అస్సలు చేయకండి.



వృశ్చికం
మీరు తలపెట్టిన పనులు అసంపూర్తిగా పూర్తవుతాయి. ఎవరితోనైనా కలిసి పనిచేయడం వల్ల సక్సెస్ అవుతారు. ప్రేమ వ్యవహారాల్లో అడుగు ముందుకు పడుతుంది. మీ మనసంతా ఆనందంగా ఉంటుంది. కొత్త కోర్సులు నేర్చుకోవడంపై విద్యార్థులు ఆసక్తి చూపిస్తారు.



ధనస్సు
మీ మనసులో ఏముందో ఎవరికైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఈరోజు మీరు ప్రతిపనినీ చాలా శ్రద్ధగా చేస్తారు. కొన్ని రహస్యాలు వెలికితీసేందుకు ప్రయత్నిస్తారు. మీ బాధ్యత పెరుగుతుంది. వ్యాపారం కోసం కొత్త వ్యక్తులను సంప్రదించాల్సి వస్తుంది.



మకరం
ఈ రోజు వ్యాపారులు చాలా కష్టపడితే కానీ లాభాలు పొందలేరు. ఉద్యోగులు ఉన్నతాధికారును పని విషయంలో సంతృప్తి పర్చలేరు. కష్టపడి పనిచేస్తే కానీ మంచి ఫలితాలు అందుకోలేరు. ఊహాగానాలతో సమయం వృధా చేయకండి.



కుంభం
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. వైవాహిక సంబంధాలు బావుంటాయి. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. కుటుంబంలో సంతోష వాతావరణం ఉంటుంది.



మీనం
వ్యాపారులు, ఉద్యోగులు మంచి అవకాశాలు పొందుతారు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. ఆర్థికంగా మరో మెట్టు ఎక్కుతారు. ఆకస్మిక ధనలాభాలు ఉండొచ్చు. సొంత పెట్టుబడి పెట్టేందుకు కూడా మంచి సమయం. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది