మేషం మీ జీవిత భాగస్వామిపై ప్రేమ పెరుగుతుంది. వ్యాపారులు మరింత కష్టపడితేనే ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. పనుల నాణ్యతపై చాలా శ్రద్ధ వహించాలి. మీ మానసిక స్థితిని సానుకూలంగా ఉంచండి. మీ అలవాట్లు, మీ తీరుపై విమర్శలు ఎదుర్కొంటారు.
వృషభం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయవద్దు. కడుపు నొప్పితో ఇబ్బందిపడతారు. ఉద్యోగులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. అత్యవసం అయితే తప్ప ప్రయాణం చేయవద్దు.ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.
మిథునం గతంలో మీరు పడిన కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆర్థిక సమస్యల కారణంగా కొంచెం ఆందోళన చెందుతారు. ఈ రోజు వ్యాపారంలో కొత్త ప్రణాళికను అనుసరించడం మంచిది. ఆఫీసులో సహోద్యోగుల సహకారం మీకు ఉంటుంది.
కర్కాటకం అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. సహోద్యోగుల సహకారంతో మీ పనులు త్వరగా పూర్తవుతాయి.మీరు కొత్త ఉద్యోగావకాశాలు పొందుతారు. మీ జీవిత భాగస్వామి సలహాతో మీ పని ఫలవంతమవుతుంది.
సింహం అందర్నీ నమ్మొద్దు. కొన్ని పనులు బలవంతంగా చేయాల్సి రావొచ్చు. సోషల్ మీడియాలో సున్నితమైన , తప్పుదారి పట్టించే పోస్ట్‌లను లైక్ చేయడం షేర్ చేయడం మానుకోండి. ఇంటి పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది.
కన్య వ్యాపారానికి సంబంధించిన ఎక్కువ పని కారణంగా మీరు అలసిపోతారు. పిల్లల గురించి కొంత ఆందోళన చెందుతారు. కొందకు తీయగా మాట్లాడి వారి పనులు పూర్తిచేసుకునేందుకు మిమ్మల్ని వాడుకుంటారు. మీ ఖర్చులను తగ్గించుకోండి.
తులా సామాజిక రంగానికి సంబంధించిన వ్యక్తులకు గౌరవం లభిస్తుంది. ఆర్థిక సంబంధిత పనుల్లో చిక్కులు తొలగిపోతాయి.వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ప్రభావవంతమైన వ్యక్తులతో సంబంధాలు బలంగా ఉంటాయి.
వృశ్చికం ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. మీ మనసులో ప్రేమను తెలియజేసేందుకు మంచి రోజు. చిన్నతరహా పరిశ్రమలు నిర్వహించేవారికి కొన్ని ఇబ్బందులు ఎదరవుతాయి. విద్యార్థులు తమ చదువు విషయంలో చాలా చురుగ్గా ఉంటారు.
ధనుస్సు నూతన వాహనం కొనుగోలు చేయాలనుకుంటే ఆ దిశగా అడుగేయవచ్చు. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. కుటుంబంతో సరదాగా ఉంటారు. చిన్న పొరపాట్లను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి.
మకరం ఈ రోజు మీరు ఏదో ఒక విషయంలో ఆందోళన చెందుతారు. పని చేయాలనే ఆసక్తి ఉండదు. మద్యానికి దూరంగా ఉండండి. స్టాక్ మార్కెట్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టొద్దు. ఉద్యోగులు కార్యాలయంలో అవమానాలు ఎదుర్కొంటారు.
కుంభం మీ ప్రతిష్ట పెరుగుతుంది. స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. అవివాహితులకు సంబంధం కుదురుతుంది. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది.
మీనం ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీరు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అనుకున్న పని పూర్తవడంతో సంతోషంగా ఉంటారు. బంధువులను కలిసే అవకాశం ఉంది.గత పెట్టుబడి నుంచి లాభం పొందుతారు.