పార్ట్ 3 - యక్ష ప్రశ్నలు



26 బాటసారికి, రోగికి, గృహస్థునకూ, చనిపోయిన వారికి బంధువులెవరు?
Ans: సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు



27. ధర్మానికి ఆధారమేది?
Ans: దయ దాక్షిణ్యం

28.కీర్తికి ఆశ్రయమేది?
Ans: దానం



29. దేవలోకానికి దారి ఏది?
Ans: సత్యం

30. సుఖానికి ఆధారం ఏది?
Ans: శీలం



31. మనిషికి దైవిక బంధువులెవరు?
Ans: భార్య/భర్త

32. మనిషికి ఆత్మ ఎవరు?
Ans: కుమారుడు



33. మానవుడికి జీవనాధారమేది?
Ans: మేఘం

34. మనిషికి దేనివల్ల సంతోషం లభిస్తుంది?
Ans: దానం



35. లాభాల్లో గొప్పది ఏది?
Ans: ఆరోగ్యం

36. సుఖాల్లో గొప్పది ఏది?
Ans: సంతోషం



37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది?
Ans: అహింస

38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది?
Ans: మనస్సు



39. ఎవరితో సంధి శిథిలమవదు?
Ans: సజ్జనులతో

40. ఎల్లప్పుడూ తృప్తిగా పడిఉండేది ఏది?
Ans: యాగకర్మ



41. లోకానికి దిక్కు ఎవరు?
Ans: సత్పురుషులు

42.అన్నోదకాలు వేటి నుంచి ఉద్భవిస్తాయి?
Ans: భూమి, ఆకాశం నుంచి



43. లోకాన్ని కప్పివున్నది ఏది?
Ans: అజ్ఞానం

44. శ్రాద్ధవిధికి సమయమేది?
Ans: బ్రాహ్మణుడు వచ్చినప్పుడు