ఆగస్టు 16 రాశిఫలాలు



మేషం
శ్రామికులకు ఈరోజు మంచి ప్రారంభం. వ్యాపారులు చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల లాభాలబాట పడతారు.తల్లిదండ్రులతో ఏదో విషయంలో గొడవపతారు. మీ తెలివితేటలు సక్రమ మార్గంలో ఉపయోగిస్తే మరింత సక్సెస్ అవుతారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.



వృషభం
ఈ రోజు మీ జీవితంలో కొన్ని హెచ్చు తగ్గులుంటాయి. మీ కుటుంబ సభ్యుల ఆశయాలను నెరవేరుస్తారు. మీ తెలివితేటలతో కష్టమైన సమస్యకు పరిష్కారం కనుక్కుంటారు. కార్యాలయంలో మీ పనితీరుని అధికారులు మెచ్చుకుంటారు. ఈ కారణంగా మీ శత్రువులు కూడా మీకు స్నేహితులు అవుతారు.



మిథునం
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. మీ మాటతీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు. ప్రాపర్టీ డీల్స్ జరుగుతున్నట్టైతే ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. కొత్తగా పెళ్లయిన వారి జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులు కష్టపడితేనే ఫలితం అందుకుంటారు.



కర్కాటకం
ఈ రోజు వ్యాపారం చేసే వ్యక్తులకు సంతోషకరమైన రోజు అవుతుంది. ఎవ్వరి సలహాలు పట్టించుకోవద్దు..మీ మనసు చెప్పింది వినండి. ఫైనాన్స్ రంగానికి సంబంధించిన వ్యక్తులు కొంత నష్టపోతారు. కుటుంబంలో అసమ్మతి మీకు తలనొప్పిగా మారుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.



సింహం
ఈ రోజు మీకు కోర్టు సంబంధిత విషయాల్లో అనుకూలమైన తీర్పు వస్తుంది. బంధువులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ తెలివితేటల్ని వేరేవారు ఉపయోగించుకోవచ్చు. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండి పనిచేయాలి.



కన్య
ఇంటా బయటా మీకు గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కూర్చుని ఇంట్లో ఒకరి వివాహం గురించి మాట్లాడతారు. స్నేహితులతో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఈరాశి ఉద్యోగులు ఇతరుల కన్నా ఎక్కువగా పనిపై దృష్టి సారిస్తారు. సామాజిక రంగాల్లో పనిచేసే వ్యక్తుల పనితీరు మారుతుంది.



తుల
ఈ రోజు మీకు సాధారణ రోజు అవుతుంది. ఎక్కడో దగ్గర సంఘర్షణ పరిస్థితిని ఎదుర్కోవలసి రావచ్చు. కష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నప్పటికీ ధైర్యాన్ని కోల్పోరు. మీ జీవిత భాగస్వామితో కొనసాగుతున్న విభేదాలు ముగుస్తాయి. ఫైనాన్స్‌కు సంబంధించిన వ్యక్తులు కొన్ని పెద్ద ప్రయోజనాలను పొందుతారు.



వృశ్చికం
ఈ రోజు మీకు కష్టమైన రోజు అవుతుంది. చురుకుదనం పెరిగి కొన్ని తప్పులు చేస్తారు. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. తల్లి అనారోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీ జీవిత భాగస్వామి మద్దతుతో మీ పనులు సులభంగా పూర్తవుతాయి.



ధనుస్సు
ఈ రోజు మీకు ఫలవంతంగా ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. విద్యార్థులు కొన్ని సమస్యల కారణంగా కలత చెందుతారు. ఆన్‌లైన్‌లో వ్యాపారం చేసే వ్యక్తులు పెద్ద ఆర్డర్‌ను పొందడం ఆనందంగా ఉంటుంది. ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది. మీ కోరికలు నెరవేరుతాయి.



మకరం
ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. తలపెట్టిన పని పూర్తిచేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మీ కుటుంబ సభ్యుల అనారోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతారు. వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.



కుంభం
ఈ రోజు మంచి ఫలితాలు అందుకుంటారు. కార్యాలయంలో కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీ పిల్లలు మంచి ఉద్యోగం సంపాదించారన్న వార్త మీకు ఆనందాన్నిస్తుంది. మీ పాత పరిచయస్తులు మిమ్మల్ని కలవడానికి వస్తారు. ఆర్థిక విషయాల్లో అంత తొందరగా ఎవ్వర్నీ నమ్మొద్దు.



మీనం
విద్యార్థులకు ఈరోజు కష్టంగా ఉంటుంది. చదువుపై కాకుండా ఇతర విషయాలపై దృష్టి సారిస్తారు. మాటతీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు. ఉద్యోగులకు సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగం కోసం వెతుకుతున్నవారు మరింత కష్టపడాలి.


Thanks for Reading. UP NEXT

దేవుడికి నైవేద్యంగా కొబ్బరికాయ, అరటి పండ్లే పెడతారెందుకు!

View next story