ఈ రోజు ( మార్చి 11) మీ రాశిఫలితం



మేషం
తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగం మారేందుకు నిర్ణయం తీసుకునేందుకు ఇదే సరైన సమయం. వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. కోర్టు కేసుపై నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది.



వృషభం
ఈ రోజు ఒత్తిడికి లోనవుతారు. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండొద్దు. పనిపై శ్రద్ధ వహించండి. నగదు దుర్వినియోగం చేయొద్దు. ఉద్యోగులు మీ పనితీరు మార్చుకోండి.అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.



మిథునం
ఆకస్మిక ధనలాభం ఉంటుంది. జీవిత భాగస్వామితో సఖ్యత ఉంటుంది. విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటుంది. మీరు సాంకేతిక సంబంధిత పనుల్లో మంచి ఫలితాలను పొందుతారు. మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు.



కర్కాటకం
మీ దినచర్య క్రమబద్ధంగా ఉంటుంది. సహోద్యోగుల కారణంగా మీ పనికి అడ్డంకి ఏర్పడొచ్చు. నిర్మాణ పనులకు సంబంధించి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.ఏదైనా వివాదంలో జోక్యం చేసుకుని మీ సమయాన్ని వృధా చేసుకోకండి.



సింహం
ఈ రోజు మీకు మంచి రోజు. కార్యాలయంలో పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. స్నేహితులను కలుస్తారు. సంతానం పట్ల ఆందోళనలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యాపార ఒప్పందాన్ని చేసుకునేందుకు ఇదే శుభసమయం.



కన్య
బాధ్యతను సకాలంలో నిర్వర్తించగలుగుతారు. కొత్త బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంటారు. ప్రేమ వ్యవహారాలు కలిసొస్తాయి. ఉద్యోగులకు ప్రని ప్రదేశంలో వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారంలో అనుకూల ఫలితాలు లభిస్తాయి.



తులా
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. రోజంతా ఆనందంగా ఉంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండాలి. సీనియర్లతో జాగ్రత్త. ప్రేమ సంబంధాల విషయంలో ఒత్తిడులు తొలగిపోతాయి



వృశ్చికం
కుటుంబంలో కలహాల వాతావరణం ఉండొచ్చు. పెట్టుబడి పరంగా మీరు బలహీనంగా ఉంటారు. యువత తమ కెరీర్ గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు చేయకండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.



ధనుస్సు
ఈ రోజు మీకు మంచి రోజు. జీవిత భాగస్వామి ప్రవర్తనతో మీరు సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో వచ్చే కొన్ని ముఖ్యమైన తప్పులను సులభంగా తొలగించుకోవచ్చు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రభుత్వ పనుల్లో లాభం ఉంటుంది.



మకరం
అనుభవజ్ఞుల సలహాలు పాటించడం వల్ల మీరు లాభపడతారు. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. విద్యార్ధులు చదువుతో పాటు ఇతర పనులు కూడా చేసేందుకు అడుగేయండి. ఎవ్వరిపైనా నోరు పారేసుకోవద్దు.



కుంభం
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకండి. పిల్లల కార్యకలాపాలపై నిఘా ఉంచండి. ప్రేమ వ్యవహారాల్లో కొంత ఇబ్బంది ఉంటుంది. కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడతారు.



మీనం
ఈరోజు కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కుటుంబ కలహాలు పరిష్కారమవుతాయి. కార్యాలయంలో పనులను సులభంగా పూర్తి చేయగలుగుతారు. పాత సంబంధాల విషయంలో సమస్యలు తలెత్తవచ్చు.