మేషం ఈ రోజు ఆధ్యాత్మిక పనుల్లో బిజీగా ఉంటారు. ఉండండి. మీ బాధ్యతను సకాలంలో నెరవేరుస్తారు. ఎవరికైనా సహాయం చేయాల్సిన అవసరం ఉంటే వెనకాడకండి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. మీరు కార్యాలయంలో లాభపడతారు. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. టెన్షన్ తగ్గుతుంది.
వృషభం మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వృద్ధుల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటే మీకు ఉపయోగపడతాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఉద్యోగ రీత్యా విహారయాత్రకు వెళ్తారు. గుర్తుతెలియ వ్యక్తులతో వివాదాలు ఏర్పడవచ్చు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.
మిథునం కుటుంబ పనుల్లో బిజీగా ఉంటారు. మీరు కొత్త వ్యాపార ప్రణాళికను సిద్ధం చేసుకోవచ్చు. మీ ప్రణాళికలను ఎవరికీ చెప్పొద్దు. శత్రువులు చురుగ్గా ఉంటారు. మీరు అప్పిచ్చిన మొత్తాన్ని తిరిగి పొందుతారు. మీకు సహాయం చేసిన వారిపై కృతజ్ఞత చూపండి. ఈరోజు సంతోషంగా ఉంటారు కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు.
కర్కాటకం కార్యాలయంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్న వ్యక్తిని కలుస్తారు, మీరు సత్సంగం ప్రయోజనం పొందుతారు. మత గ్రంధాల అధ్యయనం పట్ల ఆసక్తి చూపుతారు. మీ మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. గతంలో ఉన్న వివాదాలు పరిష్కారం కావచ్చు. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి.
సింహం ఈరోజు అద్భుతమైన రోజు అవుతుంది. ముఖ్యమైన పనులకు సంబంధించి కార్యాలయంలో ఎవరితోనైనా వాగ్వివాదం రావొచ్చు. మీరు మతపరమైన యాత్రకు వెళ్ళొచ్చు. మోసపూరిత ధోరణులు ఉన్న వ్యక్తులు మీ నుంచి ప్రయోజనం పొందుతారు. మీ పని విషయంలో జాగ్రత్తగా ఉండండి.
కన్యా ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. రిస్క్ తీసుకోండి కానీ జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు పరీక్షలలో విజయం సాధిస్తారు. ప్రేమికులకు తెలియని వ్యక్తులతో ఇబ్బందులు తలెత్తుతాయి. ఈరోజు మీరు స్నేహితుడి పార్టీకి హాజరవుతారు. బంధువులను కలుస్తారు. తెలివిగా ఖర్చు పెట్టండి. దూరప్రయాణాలు వాయిదా వేయండి.
తులా విదేశాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతారు. ఎప్పటి నుంచో అందాల్సిన మొత్తం చేతికొస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఆలయ దర్శనానికి వెళ్తారు. అర్ధంలేని చర్చలో సమయాన్ని వృథా చేయకండి. భగవంతుని ఆరాధించడంలో ధైర్యాన్ని పొందుతారు. ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కారమవుతాయి.
వృశ్చికం శత్రువుల కారణంగా మీ పనులకు ఆటంకం కలుగుతుంది. వ్యాపారానికి సంబంధించి కొన్ని సమస్యలు ఉండొచ్చు. రుణం చెల్లించడం కష్టమవుతుంది. అప్పు చేయాల్సి రావచ్చు. మీ ఆదాయానికి మించి ఖర్చు చేయవద్దు. స్నేహితుడితో సంతోషంగా ఉంటారు. పిల్లల పక్షాన విజయం ఉంటుంది. దంపతులు సంతోషంగా ఉంటారు.
ధనుస్సు శరీరంలో నొప్పి కారణంగా ఇబ్బంది పడతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. పాత మిత్రులను కలుస్తారు. అదనపు వ్యయం కారణంగా నెలవారీ బడ్జెట్ ప్రభావితం అవుతుంది.వ్యాపారంలో మందగమనం తొలగిపోవచ్చు. ఉద్యోగులు, విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది. కోపంతో ఎవరినీ దుర్భాషలాడకండి.
కరం విందు, వినోదాలలో గడుపుతారు. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. యువత పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఈరోజు మంచి రోజు అవుతుంది. వ్యాపారానికి సంబంధించి కొత్త ప్రణాళికను రూపొందించవచ్చు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయవద్దు.
కుంభం ఈరోజు మంచి రోజు అవుతుంది. మీరు గతంలో పెట్టిన పెట్టుబడికి తగిన ప్రయోజనం పొందుతారు. పొదుపు చేసే ఆలోచన పెంచుకోండి. బంధుమిత్రులను కలిసేందుకు ప్రణాళిక వేస్తారు. టెన్షన్ తగ్గుతుంది. ఈరోజు స్నేహితుడిని కలుస్తారు. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. అప్పిచ్చిన మొత్తాన్ని తిరిగి పొందుతారు.
మీనం విద్యార్థులకు చదువుపై ఆసక్తి తగ్గుతుంది. శారీరకంగా బలహీనంగా ఉంటారు. తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల సమస్యలు వస్తాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తెలియని వ్యక్తుల వల్ల మీ సమస్య పెరుగుతుంది. ఎవరితోనైనా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో పెట్టుకోండి.