ఏప్రిల్ 9 శనివారం రాశిఫలాలు



మేషం
మేష రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కోవచ్చు. రిస్క్ తీసుకోవద్దు. అవసరం లేకుంటే ప్రయాణం చేయొద్దు. . మీ వ్యాపారం బాగానే ఉంటుంది. బంధువు ప్రవర్తన వల్ల ఒత్తిడికి లోనవుతారు. కుటుంబ విషయాల గురించి ఆందోళన చెందుతారు.



వృషభం
మీరు మతపరమైన కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. ఈ రోజు మీరు స్నేహితుడికి ఆర్థికంగా సహాయం చేయవచ్చు. లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం. మీ ఆర్థిక స్థితి బాగుంటుంది.మీరు కార్యాలయంలో లాభపడతారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. పిల్లల వైపు నుంచి కొన్ని సమస్యలు ఉండవచ్చు.



మిథునం
మీరు ఈరోజు ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. అప్పిచ్చిన మొత్తం మొత్తాన్ని తిరిగి పొందడం కష్టం. ఎవరితోనైనా వాగ్వాదం రావచ్చు. ఆఫీసులో మీ పనులు సులభంగా పూర్తవుతాయి. ఒక ప్రాజెక్ట్ గురించి స్నేహితులతో చర్చిస్తారు.



కర్కాటకం
దంపతుల మధ్య బంధం బలపడుతుంది. మీ పనులు సాఫీగా సాగుతాయి. ఆహారం విషయంలో నియంత్రణ పాటించండి. అనవసర వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. శుభవార్త వింటారు. గుర్తుతెలియని వ్యక్తుల వల్ల మీకు సమస్యలు ఎదురుకావచ్చు. వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం.



సింహం
మీ పనులు సులభంగా పూర్తవుతాయి. మీ మాటతీరుతో ఆకట్టుకుంటారు. పనిలో నైపుణ్యం పెరుగుతుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రేమికులు తమ భాగస్వామితో కలిసి ప్రయాణాలకు ప్రణాళికలు వేస్తారు. టెన్షన్ తగ్గుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఎవరికీ సలహాలు ఇవ్వొద్దు. మీ ప్రణాళికలను బయట పెట్టొద్దు.



కన్యా
పని పెరిగి అలసట చెందుతారు. ఆరోగ్యం క్షీణించవచ్చు. ఎండల్లో బయట తిరగొద్దు. సామాజికంగా గౌరవం పెరుగుతుంది. ధర్మ-కర్మ సత్సంగంలో పాల్గొంటారు. ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుంది.



తులా
ఈ రోజు మీకు అనుకూలమైన రోజు అవుతుంది. మీరు ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్న వ్యక్తిని కలిసే అవకాశాన్ని పొందుతారు. రహస్య అధ్యయనం పట్ల ఉత్సుకత ఉంటుంది. వ్యాపార పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. పనికి సంబంధించి సమీప నగరాలను సందర్శించవచ్చు.



వృశ్చికం
తెలియని అడ్డంకులు మీ పనిని ప్రభావితం చేస్తాయి. కార్యాలయంలో అధికారులను కలుస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. మీరు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ప్రయాణానికి వెళ్లే ముందు అవసరమైన పత్రాలను మీతో తీసుకెళ్లండి. కుటుంబ బాధ్యత ఎక్కువగా ఉంటుంది.



ధనుస్సు
ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఖర్చులు సమస్యను మరింత పెంచుతాయి. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయలేరు. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశాలు ఉండొచ్చు. బంధువుల నుంచి విచారకర వార్తలు వినే అవకాశం ఉంది. పిల్లల విజయాలతో సంతోషంగా ఉంటారు.



మకరం
మీరు ఈరోజు కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. తప్పుడు పనులు చేసి డబ్బు సంపాదించాలని ప్రయత్నించవద్దు. అకస్మాత్తుగా ఎవరితోనైనా గొడవ రావొచ్చు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి. ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తం చేయండి. వ్యాపారులకు లాభాలొస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు సాధిస్తారు.



కుంభం
కుంభ రాశి వారికి ఈ రోజు మంచి రోజు. మీ పనులు సులభంగా పూర్తవుతాయి. దంపతుల మధ్య మనస్పర్థలు రావొచ్చు. స్నేహితులను కలుస్తారు. మీరు ప్రభుత్వ పనులు పూర్తి చేయడంతో సంతోషంగా ఉంటారు. వాహనం కొనుగోలు చేయవచ్చు. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. జాగ్రత్తగా ఖర్చు పెట్టండి.



మీనం
ఉద్యోగులు ప్రమోషన్ నోటిఫికేషన్ పొందుతారు. మీ ఆర్థిక స్థితి పెరుగుతుంది. కుటుంబ వాతావరణం బావుంటుంది. గతంలో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. మీరు ప్రయాణాల వల్ల ప్రయోజనం పొందుతారు. పెట్టుబడి అవకాశాలు లభిస్తాయి. మీ రహస్యాలను ఎవరికీ చెప్పొద్దు. కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు.