స్టార్ హీరో ఎన్టీఆర్ లగ్జరీ లైఫ్‌స్టైల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం! ఎన్టీఆర్ లంబోర్ఘిని యూరుస్ గ్రాఫైట్ మోడల్ కారు కొన్నారు. దీని ఖరీదు రూ.3.16 కోట్లు. ఆయన వద్ద మెర్సీడెస్ బెంజ్ జీఎల్ఎస్ 350డీ, రేంజ్ రోవర్ వోగ్యూ ఎస్‌యూవీలు కూడా వున్నాయి. అలాగే పోర్షే 718 కేమ్యాన్‌ను 85.95 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఎక్కువగా వినియోగించే కారు బీఎండబ్ల్యూ ఎల్‌డీ.. దీని ధర 1.32 కోట్లు. దీనిని ఎన్టీఆరే నడుపుతున్నారు. ఎన్టీఆర్‌కు రూ.80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ వుందని సమాచారం. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో విలాసవంతమైన బంగ్లా వుంది. అలానే బెంగళూరు, కర్ణాటకలలోనూ విలాసవంతమైన భవనాలు వున్నాయి. ఎన్టీఆర్ నికర ఆస్తుల విలువ రూ.444 కోట్లు ఉంటుందని అంచనా. సినిమాలతో పాటు యాడ్స్ రూపంలో ఎన్టీఆర్ బాగా సంపాదిస్తున్నారు.