నిద్రలేమి వంటి కారణాల వల్ల చాలామంది డార్క్ సర్కిల్స్ వస్తాయి. ఏదో అనుకుంటాము కానీ.. ఇవి ముఖం అందాన్ని మొత్తం పాడుచేసేస్తాయి. డార్క సర్కిల్స్ వల్ల కొందరు బయటకు వెళ్లడానికి కూడా ఇష్టపడరు. అయితే కలబందతో మీరు డార్క్ సర్కిల్స్‌కు చెక్ పెట్టవచ్చు. అలోవెరాలో ఎన్నో అద్భుత ఔషదగుణాలు ఉన్నాయి. ఇవి డార్క్ సర్కిల్స్ తగ్గిస్తాయి. రాత్రి పడుకునే ముందు అలోవెరా జెల్‌ను కళ్ల చుట్టు రాసుకోవాలి. ఇది డార్క్ సర్కిల్స్ తగ్గించడమే కాకుండా.. చర్మానికి మంచి కాంతిని అందిస్తుంది. కలబందలో తేనె కలిపి కూడా ఫేస్‌కి మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు. (Image Source : Unsplash, Pinterest)