సరైన నిద్రలేక చాలా మందికి కంటి చుట్టూ నల్లని వలయాలు ఏర్పడతాయి. ఒత్తిడి, తలనొప్పి, ఎండ వంటి కారణాలతో ఇవి ఏర్పడి అందంపై ప్రభావం చూపిస్తాయి. అయితే వీటిని కొన్ని ఇంటి చిట్కాలతో దూరం చేసుకోవచ్చు. కంటి నిండా నిద్రపోవడం వల్ల ఈ సమస్య చాలావరకు తగ్గిపోతుంది. ఐస్ క్యూబ్‌తో 20 నిమిషాలు మసాజ్ చేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తే రక్తప్రసరణ పెరిగి సమస్య తగ్గుతుంది. టమాటో గుజ్జును కంటి కింద అప్లై చేస్తే డార్క్నెస్ పోతుంది. టీబ్యాగ్స్‌ను ఓ పావు గంట కంటిపై పెడితే నల్లని వలయాలు తగ్గుతాయి. (Images Source : Unsplash)