టాలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది తాప్సీ. ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎన్నుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకి పైగా సినిమాలున్నాయి. ఇటీవల ఆమె నటించిన 'హసీనా దిల్ రుబా', 'అనబెల్ సేతుపతి', 'రష్మీ రాకెట్' వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రస్తుతం ఆమె నటించిన 'శెభాష్ మిథు' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది తాప్సీ. ఈ సందర్భంగా ఆమెకి సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో తాప్సీ ఎంతో క్యూట్ గా కనిపిస్తుంది. 'శెభాష్ మిథు' ప్రమోషన్స్ లో తాప్సీ.