తెలంగాణలో జూలై 27 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు

అల్పపీడన ద్రోణి బలపడటంతో ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులపాటు వర్షాలు

కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ అలర్ట్ జారీ, కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ సైతం జారీ

అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టంపై 0.9 కి.మీ వరకు విస్తరించి ఉంది

మహబూబాబాద్, జనగామ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు

హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ వర్షాలు

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు

ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు

అత్యవసరమైతే తప్ప, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలను అధికారులు హెచ్చరించారు