దోమల వల్ల మనుషులకు ఎన్ని రోగాలు వస్తాయి?

Published by: Shankar Dukanam
Image Source: pexels

దాదాపు భారతదేశంలోని అన్ని నగరాల్లో దోమల బెడద ఉంది

Image Source: pexels

దోమలు ముఖ్యంగా సాయంత్రం నుంచి రాత్రివేళ ప్రజలను ఇబ్బంది పెడుతుంటాయి

Image Source: pexels

దోమల కాటు వల్ల డెంగ్యూ వ్యాధితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాటి వల్ల ఇంకా చాలా వ్యాధులు వస్తాయి.

Image Source: pexels

దోమల కాటు వల్ల మలేరియా వస్తుంది. దీనివల్ల వ్యక్తికి తీవ్రమైన జ్వరం, శరీర నొప్పులు వస్తాయి. ఇది ప్రాణాంతకం

Image Source: pexels

చికెన్ గున్యా వైరస్ వీటి ద్వారానే వ్యాప్తి చెందుతుంది. తీవ్రమైన జ్వరం, కీళ్లలో భయంకరమైన నొప్పి చాలా వారాలు లేదా నెలల వరకు ఉండవచ్చు

Image Source: pexels

జికా వైరస్ కూడా దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది

Image Source: pexels

జపనీస్ ఎన్సెఫాలిటిస్ ఈ వ్యాధి చాలా ప్రమాదకరం. ఇది కూడా వీటి ద్వారానే వ్యాప్తి చెందుతుంది. మెదడులో వాపు వస్తుంది

Image Source: pexels

దోమల కాటు వల్ల వ్యాప్తి చెందే ఒక వ్యాధి ఫైలేరియా. దీనివల్ల శరీర భాగాలలో వాపు వస్తుంది.

Image Source: pexels

దోమల ద్వారా సుమారు 15- 20 వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, దోమలు రాకుండా చూసుకోవడమే మంచిది.

Image Source: pexels