వానాకాలం మొదలైపోయింది. ఇంకేముంది రోగాలు కూడా వచ్చేస్తాయి. సీజన్ మారడం వల్ల దగ్గు, జలుబు లాంటివి వస్తాయి. ఈ సీజన్ లో కొన్ని పండ్లు తింటే రోగాలు రావు. అవేంటంటే? దానిమ్మ.. ఇమ్యూనిటీని పెంచుతుంది. రోగాల బారినపడకుండా చేస్తుంది. బేరీకాయలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది. బ్లూ బెర్రీస్ తినడం వల్ల జలుబు, ఇన్ ఫెక్షన్లు రావు. చెర్రీలో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి. దీంతో రోగాలు రావు. లిచ్చీలో చాలా పోషక విలువలు ఉన్నాయి. అవి ఇన్ ఫెక్షన్స్ బారినపడుకుండా చేస్తుంది. నేరేడు పండు షుగర్ ని కంట్రోల్ లో ఉంచుతుంది. వానాకాలంలో ఇది తింటే చాలామంచిది. రేగిపండ్లలో విటమిన్లు ఏ, సి ఉంటాయి. అవి ఆహారం అరిగేందుకు సహకరిస్తాయి.