చిప్స్ అధికంగా తింటే సంతానోత్పత్తి సమస్యలు

బంగాళాదుంప చిప్స్ ఇప్పుడు పిల్లల హాట్ ఫేవరేట్. పిల్లలే కాదు యువత కూడా తెగ తింటున్నారు ఈ స్నాక్స్‌ని.

వీటిని రోజూ తినేవారిలో దీర్ఘకాలికంగా కొన్ని ఆరోగ్య సమస్యలు బయటపడే అవకాశం ఉందని చెబుతున్నాయి అధ్యయనాలు.

రోజూ చిప్స్ తినేవారిలో బీపీ వచ్చే అవకాశం అధికం.

గుండె సంబంధ వ్యాధులను, స్ట్రోక్ వచ్చే అవకాశాన్ని కూడా రెట్టింపు చేస్తాయి.

దీర్ఘకాలంలో మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి.

వీటిని అధికంగా తినేవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది.

చిప్స్‌లో శాచురేటెడ్ కొవ్వులు, సోడియం, క్యాన్సర్ కారకాలు అధికంగా నిండి ఉంటాయి.

చిప్స్‌లో ఉండే కొన్ని రకాల కొవ్వులు పునరుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గర్భం దాల్చడం కష్టమైపోతుంది.

వీటిలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. డిప్రెషన్ వచ్చే అవకాశం పెరుగుతుంది.