అల్లం వెల్లుల్లి సూప్‌తో రోగనిరోధక శక్తి



వేసవిలో అనేక సీజనల్ వ్యాధులు దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాయి. అందుకే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి.



శ్వాసకోశ సమస్యలు కొందరిలో వేధిస్తాయి. వారు అల్లం వెల్లుల్లి సూప్ తాగడం వల్ల వారిలో మంచి ఉపశమనం లభిస్తుంది.



మహిళలు వారానికోసారైనా ఈ సూప్ ను తాగితే చాలా మంచిది. రుతుస్రావం సమయంలో కలిగే నొప్పిని తగ్గిస్తుంది.



యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కనుక, గుండె ఆరోగ్యానికి చాలా మేలు.



యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటితో సమర్థంగా పోరాడతాయి.

వెల్లుల్లిలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.

బరువు తగ్గేందుకు ఈ సూప్ చాలా సహాయపడుతుంది.

గోరు వెచ్చగా ఈ సూప్ ను మూడు రోజులకోసారి తాగితే చాలా మంచిది.