పుచ్చకాయ తింటే కిడ్నీ సమస్యలు దూరం
వేసవిలో పుచ్చకాయలు మార్కెట్లో భారీగా దిగుమతి అవుతాయి.
శరీరానికి చలువ చేసే ఆహారాల్లో పుచ్చకాయదే ప్రథమ స్థానం.
దీన్ని తింటే శరీరం చురుకుగా ఉంటుంది. కండరాలకు నొప్పులు తగ్గుతాయి.
దీనిలో 90 శాతం నీరే కాబట్టి, శరీరాన్ని తేమ వంతంగా ఉంచుతుంది.
ఆస్తమా ఉన్న పిల్లలకు పుచ్చకాయ మేలు చేస్తుంది.
ఇందులో లైకోపీన్ గుండెకు మంచిది.