పీనట్ బటర్ తింటే ఈ రోగాలేవీ రావు



పీనట్ బటర్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని వేరుశెనగ పలుకులతో తయారుచేస్తారు.



ఇందులో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. తింటే పొట్ట నిండినట్టుగా అనిపిస్తుంది. తద్వారా బరువు తగ్గొచ్చు.



వేరు శెనగలో అర్గినైన్ అని పిలిచే అమినో ఆమ్లం ఉంటుంది. ఇది గుండె సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది.



పీనట్ బటర్‌ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించేందుకు సాయపడుతుంది.



గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఏర్పడే అవకాశాన్ని ఇది తగ్గిస్తుంది.



క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని ఇది నిరోధిస్తుంది.

ఎముకలను ధృఢంగా మారుస్తుంది.



దీనిలో శరీరానికి అవసరమైన పొటాషియం, మెగ్నిషియం అధికం.



పీనట్ బటర్లో చెడు కొవ్వులు ఉండవు.