తీవ్ర ఒత్తిడి తగ్గాలంటే ఇవిగో చిట్కాలు

ఆధునిక జీవితంలో ఒత్తిడి అధికమైపోతుంది. ఒత్తిడిని తగ్గించేందుకు చిన్ని చిట్కాలు పనిచేస్తాయి.

ఆరోగ్యకరమైన ఆహారం, శరీనానికి సరిపడినంత నీళ్లు తాగుతూ ఉండాలి.

రోజూ వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

సిగరెట్, ఆల్కహాల్ తాగడం ఒత్తిడి తగ్గదు, ఇంకా పెరుగుతుంది.

యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఒత్తిడి అనిపించినప్పుడు చేస్తున్న పనిని వదిలి కాసేపు మీకు నచ్చిన వర్క్ చేసుకోవాలి.

మిమ్మల్ని ఒత్తిడికి గురిచేసే, నెగిటివ్‌గా మాట్లాడే వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి.

రోజుకు ఎనిమిది గంటలు తగ్గకుండా నిద్రపోవాలి.