మామిడి తొక్కలు పడేస్తున్నారా మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. వేసవిలో ఈ పండ్లదే హవా. మామిడి తొక్కను తీసేసి లోపలి గుజ్జును మాత్రమే వాడుకుంటాం. మామిడి తొక్కను తినడం వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్య పోవడం ఖాయం. ఈ తొక్కలలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. కంటి చూపుకు, మెదడు పనితీరుకు, చర్మానికి ఇది చాలా అత్యవసరం. మహిళలు తొక్కతో పాటూ తినడం వల్ల ఐరన్ అంది రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా మామిడి తొక్కలు మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తాయి. జీర్ణ వ్యవస్థ కూడా చక్కగా పనిచేస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి. మలబద్ధకం రాదు. గుండె జబ్బులు, హైబీపీ వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. మామిడి తొక్కలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది.