వేసవి ఔషధం కొబ్బరి నీళ్లు వేసవిలో అందరూ కచ్చితంగా తాగాల్సిన పానీయం కొబ్బరి నీళ్లు. శరీరం వడదెబ్బకు గురికాకుండా కొబ్బరి నీళ్లు కాపాడతాయి. చర్మాన్ని తేమవంతంగా ఉంచి, మెరిసేలా చేస్తాయి. కొబ్బరినీళ్లలో కేలరీలు తక్కువ. ఎంత తాగినా బరువు పెరగరు. గుండె ఆరోగ్యానికి ఇది చాలా అవసరం. వేసవి తాపానికి నీరసం రాకుండా కాపాడుతుంది. జుట్టుకు కూడా కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. ఆల్కహాల్ వల్ల హ్యాంగోవర్ కు గురైన వారికి కొబ్బరినీళ్లు ఉపశమనాన్ని అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి.