ప్రపంచం మెచ్చిన అందం... హర్నాజ్ సొంతం

21 ఏళ్ల విరామం అనంతరం విశ్వ వేదికపై భారత అందం మెరిసింది. పంజాబ్‌కు చెందిన హర్నాజ్ కౌర్ సందు మిస్ యూనివర్స్‌గా గెలిచింది.

80 దేశాల నుంచి వచ్చిన అప్సరసలతో పోటీ పడి విశ్వ కిరీటాన్ని దక్కించుకుంది.

పోటీకి వెళ్లే ముందే హర్నాజ్ ‘కిరీటాన్ని తిరిగి భారతదేశం తెచ్చేందుకు శాయశక్తులా కష్టపడతా’ అని చెప్పి మరీ వెళ్లింది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంది.

హర్నాజ్ పంజాబ్ రాష్ట్రంలోని ఛండీఘడ్ లో 2000 సంవత్సరం మార్చి 3న జన్మించింది.

పదిహేడేళ్ల వయసులోనే మిస్ చండీఘడ్ గా ఎంపికైంది.

కొన్ని పంజాబీ సినిమాలలో కూడా నటించింది. కానీ అవి పెద్దగా హిట్ కొట్టకపోవడంతో ఆమె గురించి ఎవరికీ పెద్దగా తెలియలేదు.

2019లో హర్నాజ్ ఫెమినీ మిస్ ఇండియా టైటిల్ ను గెలుచుకుంది.

మిస్ యూనివర్స్ గా గెలిచిన హర్నాజ్ ఇకపై న్యూయార్క్ లో నివసించబోతోంది.

అక్కడే ఉండి ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక చైతన్య కార్యక్రమాలకు దేశం తరుపున హాజరవ్వబోతోంది.