2005లో ‘పరిణీత’లో లోలిటా అనే పాత్రతో విద్యాబాలన్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ‘లగే రహో మున్నాభాయ్’లో ఆర్జే జాన్వీ పాత్రలో మెప్పించింది. ‘భూల్ భూలయ్యా’లో అవని పాత్రకు ఫిల్మ్ ఫేర్ నామినేషన్ కూడా పొందింది. ‘కహాని’లో విద్య బగ్చి పాత్రలో గర్భిణిగా నటించింది. ‘కహాని 2’లొ కూడా స్కూల్ టీచర్ పాత్రలో కనిపించింది. ‘పా’ సినిమాలో ‘డాక్టర్ విద్య’ క్యారెక్టర్‌లో మనసులు గెలుచుకుంది. ‘నో వన్ కిల్డ్ జెస్సికా’లో సబ్రినా లాల్ పాత్రకు ఫిల్మ్ ఫేర్ అవార్డుకు నామినేట్ అయింది. ఇక ‘డర్టీ పిక్చర్’లో సిల్క్ పాత్ర ఎవరికి మాత్రం గుర్తుండదు చెప్పండి! ‘బేగం జాన్’లో కూడా లీడ్ రోల్‌లో నటించారు. ‘షేర్ని’లో తన పాత్రకు ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది.