‘బిగ్ బాస్’ ఫేం ఇనాయ తిరుమల తిరుపతిలో ప్రత్యక్షమైంది. తిరుమల ఆలయం ప్రాంగణంలోని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. బిగ్ బాస్ తర్వాత ఇనాయ పలు షోస్ లో కనిపిస్తూ బిజీ బిజీ గా ఉంటోంది. తాజాగా ఈ బ్యూటీ సోహెల్ కు ప్రపోజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రీసెంట్ గా జరిగిన నేహా చౌదరి పెళ్ళిలో తన ‘బిగ్ బాస్’ ఫ్రెండ్స్ తో కలిసి సందడి చేసింది. ప్రస్తుతం రోల్ రైడా, ఇనాయ జంటగా 'BB Jodi' డాన్స్ షోలో పాల్గొంటున్నారు. 'వేర్ ఈజ్ ది పార్టీ' అని స్టెప్పులు వేస్తూ సందడి చేస్తోంది. ఇనయాకు సినిమాల్లో కూడా ఛాన్సులు వస్తున్నాయట. అయితే, తొందరపడకుండా ఆచీతూచి అడుగు వేయాలని అనుకుంటుందట. Image Credit: Inaya Sultana/Instagram