దీపిక పదుకొనే లాంటి చర్మం కావాలి అనుకుంటున్నారా? అయితే మీరు కూడా ఆమెలా జాగ్రత్తపడాలి. రోజంతా షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉండే దీపిక తన చర్మాన్ని సంరక్షించుకోవడంలో అస్సలు రాజీ పడదు. సన్ స్క్రీన్, ఐ క్రీమ్‌లు లేకుండా దీపిక అస్సలు బయటికి వెళ్ళదు. ఈ మధ్యే తను సొంతంగా SPF 40 సన్ స్క్రీన్ స్కిన్ కేర్ బ్రాండ్ ను కూడా రిలీజ్ చేసింది. ముఖాన్ని మరింత అందంగా, ఆరోగ్యంగా ఉంచడానికి మంచి ఫేస్ మాస్కులను ఉపయోగిస్తుంది. పడుకునే ముందు తప్పకుండా ముఖంపై ఉన్న మేకప్ ను తీసేస్తుంది చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచి, శరీరాన్ని హైడ్రేట్ చేసేందుకు ఎక్కువగా నీరు తాగుతుంది. ముఖాన్ని ఐస్‌తో క్లీన్ చేస్తుంది. దాని వల్ల ముఖంపై ఉండే రంధ్రాలు, మొటిమలు తగ్గుతాయట. Image Credits: Deepika Padukone/Instagram