బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా నేడు 39 సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. అతను త్వరలో కియారా అద్వాణీని వివాహం చేసుకోబోతున్నాడని టాక్. 2012లో వచ్చిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో బాలీవుడ్‌లో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. అంతకు ముందు షారుక్ ఖాన్ ‘మై నేమ్ ఈజ్ ఖాన్’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ‘హసీ తో ఫసీ’, ‘ఏక్ విలన్’ సినిమాలతో స్టార్‌డం సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాత వరుస పరాజయాలు పలకరించాయి. అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయిన ‘షేర్‌షా’ బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకుంది. త్వరలో తన ‘మిషన్ మజ్ను’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ‘యోధ’ అనే సినిమాలో కూడా సిద్ధార్థ్ నటిస్తున్నాడు. ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.