వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా రాలిపోతుండటం వల్ల విసిగిపోయారా? అయితే జింక్ అధికంగా ఉంటే ఆహారాన్ని తిని చూడండి.



జింక్ అనేది ముఖ్యమైన ఖనిజం. జుట్టు పెరుగుదల, రిపేర్ కి దోహదపడుతుంది.



నువ్వుల్లో జింక్, ప్రోటీన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు పెరుగుదలని పెంచుతాయి.



గుడ్లు అమైనో ఆమ్లాలు, జింక్ గొప్ప మూలం. జుట్టు రాలడాన్ని అపుతాయి.



గుల్లలు వంటి సీ ఫుడ్ జింక్ అందించే ఉత్తమ ఆహార వనరులలో ఒకటి.



గుమ్మడికాయ గింజల్లో సహజంగా జింక్, ఐరన్, విటమిన్ ఇ వంటి జుట్టుకి ఆరోగ్యకరమైన పోషకాలని అందించేవి పుష్కలంగా ఉన్నాయి.



కాయధాన్యాలు ప్రోటీన్ వీటిలో సమృద్ధిగా ఉండటమే కాదు జింక్ ను అందిస్తుంది.



జుట్టు పెరుగుదలని పెంచడానికి సమతుల్య ఆహారంతో పాటు ఆరోగ్యకరమైన విటమిన్లు ఏ, సి, ఇ వంటి పోషకాలు తీసుకోవడం చాలా ముఖ్యం.