మిథున రాశి వారఫలాలు ( డిసెంబరు 10 - 16) ఈ వారం మిథున రాశివారి జీవితంలో విజయానికి కొత్త తలుపులు తెరుకుంటాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి నెరవేరుతాయి. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. వ్యాపారులు ఆశించిన లాభాలు పొందుతారు. వృత్తి లేదా వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు శుభప్రదంగా ఉంటాయి. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. వారం మధ్యలో ఆకస్మిక పిక్నిక్‌లు లేదా పార్టీలు ఉండవచ్చు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సానుకూల వార్తలు అందుతాయి. ప్రస్తుత స్నేహాలు ప్రేమ సంబంధాలుగా మారవచ్చు. ఇప్పటికే ఉన్న ప్రేమ సంబంధాల్లో అపార్థాలు ఎదురవుతాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన పెరుగుతుంది. Images Credit: Pixabay