ఫ్రెంచ్ ఫ్రైస్ బాక్స్ ముందు పెట్టుకున్నారంటే ఎన్ని తింటున్నారో కూడా అర్థం కాదు.



ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా పరిశోధన వెలుగులోకి వచ్చింది.



వేయించిన బంగాళాదుంపలు తరచుగా తీసుకోవడం వల్ల డిప్రెషన్, యాంగ్జయిటీ రిస్క్ 7%,12% పెరుగుతున్నాయని తేలింది.



డీప్ ఫ్రై చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ ఎదురవుతాయి.



ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకోవడం వల్ల డిప్రెషన్ ప్రమాదాన్ని మరో 2 శాతం పెంచింది.



బంగాళాదుంపలతో కాకుండా క్యారెట్, స్వీట్ పొటాటోతో చేసుకున్న
ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుంటే నోటికి రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యాన్ని అందిస్తాయి.


వాటిని నూనెలో వేయించుకోవడం కాకుండా ఆవిరితో ఉడికించుకోవాలి.



శరీరానికి కావాల్సిన పోషకాలను చిలగడదుంప అందిస్తుంది. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.



మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.