కొన్నిరకాల పోషకాలు తీసుకున్నపుడు మెదడు పనితీరు మెరుగు పడుతుంది. అవేమిటో తెలుసుకుందాం. యాంటీఆక్సిడెంట్ల తో ఉండే బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ వంటి బెర్రీ ప్రూట్స్ ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించి మెదడు పనితీరు మెరుగు పరుస్తాయి. సాల్మన్ వంటి నూనెకలిగిన చేపల్లో ఉండే ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్ల వల్ల జ్ఞపకశక్తి పెరుగుతుంది. పొట్టుతో పాటు ఉండే హోల్ గ్రేయిన్స్ రూపంలో ధ్యాన్యాలను తీసుకున్నపుడు మెదడు పనితీరు బావుంటుంది. ఆకుకూరల్లో మెదడు ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలన్నీ ఉంటాయి. బాదం, జీడిపప్పు, వాల్నట్ వంటి గింజల్లో యాంటీఆక్సిడెంట్లు, ఒమెగా3 పుష్కలం కనుక జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. కాపీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెదడు చురుగ్గా పనిచేసేందుకు దోహదం చేస్తాయి. విటమిన్ సి ఎక్కువగా ఉండే నారింజ పండ్లు కూడా మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఆరోగ్యవంతమైన అన్ సాచ్యూరేటెడ్ కొవ్వులు కలిగిన అవకాడో మెదడును చురుకుగా ఉంచుతుంది. Imeges courtesy : Pexels