ఖర్జూరాల్లో పొటాషియం, మెగ్నీషియంతో పాటు బోలెడన్ని విటమిన్స్ ఉంటాయి. ఖర్జూరాల్లో పైబర్ ఎక్కువ కనుక జీర్ణక్రియకు తోడ్పడుతాయి. మోతాదులో తింటే రక్తంలో షుగర్ స్థాయిని అదుపు చేస్తాయి. కొన్ని రకాల మిఠాయిల తయారీలో వీటిని చక్కెరకు బదులుగా వాడడం వల్ల మిఠాయిలు ఆరోగ్యవంతంగా తయారవుతాయి. ఇవి తక్షణ శక్తి అందించే ఆరోగ్యవంతమైన స్నాక్ గా చెప్పుకోవచ్చు. ఖర్జూరాల్లో ఉండే యాంటీఆక్సిడెంట్ల వల్ల కణజాలాల మీద ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గి కణజాలాలు ఆరోగ్యవంతం అవుతాయి. ఖర్జూరాల్లో ఉండే కాల్షియం, ఫాస్పరస్ వల్ల ఎముకల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఖర్జూరాల్లో పొటాషియం ఉండడం వల్ల ఇవి కార్డియో వాస్క్యూలార్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బీపిని అదుపులో ఉంచుతాయి. ఎక్కువ తింటే జీర్ణం కావడానికి ఇబ్బంది ఏర్పడుతుంది. కనుక 5-6 ఖర్జూరాలకు మించి తినకపోవడమే మంచిది. Images courtesy : Pexels